One Day Teen - A Reunion
🏠 My other blogs School reunion.. Jump to English translation ఫాస్ట్ ఫార్వార్డ్ >>>>>> జులై 2022 ఆరేళ్ళ క్రితం నేను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని నన్ను వెళ్ళగొట్టేసిన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను ఈసారి మహేష్ చేర్చాడు. ఆగష్టు 7వ తారీఖున స్కూల్ రీయూనియన్ ఖాయం చేశారు. ఇన్ని సంవత్సరాల తరువాత అసలు నేను కలిసి వీళ్ళందరితో ఏం మాట్లాడుతాను? సరిగ్గా కలవగలనా? అసలు వెళ్ళడం అవసరమా? ఏం చెప్పి మానేద్దాం? అని ఇలా రక రకాల ఆలోచనలు. గ్రూప్ లో మాత్రం పెళ్ళి తీరున హడావిడి. ఎక్కడ, ఏం కార్యక్రమాలు, ఎవరెవరికి ఏం బాథ్యతలు అన్నీ నిర్ణయించేస్తున్నారు. తరువాత మహేష్ ఫోన్ - "అందరం క్లాసు వాళ్ళం కలుస్తాం", అని. "7వ తారీఖున నేను రాలేను. వేరే పెళ్ళి-పేరంటం ఉంది", అని చెప్పి, నేను మనసులో "హమ్మయ్య! ఏదో ఒకటి చెప్పి తప్పించేసుకున్నా" అనుకున్నా. "7వ తారీఖు కాదు, 14వ తారీఖుకి మార్చాం. టీచర్స్ ని కూడా పిలుస్తున్నాం", అన